Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Devi Temple Flood: ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సిద్ధపీఠ శ్రీ శాకంబరి దేవి ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు రావడంతో భారీ విషాదాన్ని మిగిల్చాయి. శివాలిక్ కొండల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు ఆలయ ప్రాంతంలోకి చేరుకుంది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే జలమయమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోగా, భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం రావడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పెద్ద శబ్దాలతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలను తీసుకుని ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
భారీ వరద ప్రవాహంలో ట్రాక్టర్ ట్రాలీలు, కార్లు, బైక్లు, నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న యంత్రాలు కొట్టుకుపోయాయి. ఆలయ సమీపంలోని ప్రసాదం దుకాణాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేశాయి. పలుచోట్ల వాహనాలు బురదలో కూరుకుపోయి కనిపించాయి. స్థానికులు, భక్తులు కలిసి వాటిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించారు. వరద కారణంగా అనేక దుకాణాలు దెబ్బతినగా, ఆలయ పరిసర ప్రాంతమంతా బురద, చెత్తతో నిండిపోయింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!