Site icon NTV Telugu

Fixed Deposit: గడువుకు ముందే ఎఫ్‎డీ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొనే ఇలా చేయండి

Fixed Deposits

Fixed Deposits

Fixed Deposit: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్.. పెట్టుబడిదారులకు చాలా ఇష్టమైన పథకం. ప్రస్తుతం ఇది మంచి రాబడిని అందిస్తోంది. ఇందులో డబ్బును డిపాజిట్ చేస్తే పెట్టుబడిదారుల డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కింద 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు ఈ పథకం కింద కోట్ల రూపాయలను డిపాజిట్ చేయవచ్చు. కాలవ్యవధిని బట్టి వివిధ రకాల వడ్డీ ఇవ్వబడుతుంది.

మీకు అర్జంట్ గా మనీ అవసరం అవుతాయి. ఉన్నట్లుండి మీకు ఎఫ్ డీ ఒక్కటే ఆప్షన్ అనుకోండి. మెచ్యూరిటీ కంటే ముందుగానే ఈ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేస్తే మీ నుండి ఛార్జీ రికవర్ చేయబడుతుంది. అయితే, మీ ఎఫ్‎డీ మెచ్యూర్ అయినప్పుడు మీరు దానిని ఉపసంహరించుకోవచ్చు. ఇది ఒక సంవత్సరం పాటు పునరుద్ధరించబడుతుంది. మీ ఎఫ్‎డీ మెచ్యూరిటీ ముందుగానే ఎఫ్‎డీ ఎలా క్లోజ్ చేయాలో తెలుసుకోండి.

Read Also:Gannavaram Politics: గన్నవరంలో వైసీపీకి బిగ్‌ షాక్‌..!

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో మాత్రమే ఖాతా మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. మీ ఎఫ్డీ మెచ్యూర్ అయినట్లయితే వడ్డీ, అసలు మొత్తం మీ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎఫ్ఢీ ఖాతాను తెరిచి ఉంటే దాన్ని మూసివేసే ప్రక్రియ మరింత సులభం. మీరు చేయాల్సిందల్లా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహాయంతో ఎఫ్డీ విభాగానికి వెళ్లి ఈ ఖాతాను మూసివేయడానికి ఎంపికను ఎంచుకోండి.

ఆన్‌లైన్‌లో ఎస్‌బిఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఎలా మూసివేయాలి
– ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
– ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– దీని తర్వాత మీరు ప్రీమెచ్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేసే ఆప్షన్ ఎంచుకోవాలి.
– మీరు ఇప్పుడు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ అన్ని వివరాలను ధృవీకరించాలి. తర్వాత క్లోజింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
– ఎఫ్‌డిని మూసివేయడానికి గల కారణాన్ని తెలియజేయాలి.
– ఇలా చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ నంబర్‌కు OTP పంపబడుతుంది
– దీన్ని నమోదు చేయండి, ఆపై ఇమెయిల్‌కు పంపబడిన వెరిఫికేషన్ మెయిల్ క్లిక్ చేయాలి
– ఇప్పుడు మీ ఎఫ్ డీ ఖాతా క్లోజ్ అవుతుంది.

Read Also:Girl Plan Kill Father: ప్రియుడి కోసం తండ్రికే స్కెచ్ వేసిన కూతురు.. సుపారీ ఇచ్చి మరీ..

HDFC బ్యాంక్ FDని ఆన్‌లైన్‌లో ఎలా మూసివేయాలి
– మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ ఉపయోగించి నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ చేయండి
– ఫిక్స్‌డ్ డిపాజిట్ మెనులో లిక్విడేట్ FD ఎంపికను ఎంచుకోండి
– ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి
– ఆ తర్వాత మరింత ముందుకు సాగండి. పూరించిన వివరాలను నిర్ధారించండి

Exit mobile version