Dog Attack : హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన విషయం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కుక్కలు.. ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను తీశాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రఘునాథపాలెం మండలం పుటాని తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్ ఆదివారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వీధి కుక్క దాడి చేసింది.
Read Also:Florida Teacher Affair: టీచర్ వక్రబుద్ధి.. మైనర్ బాలుడితో స్కూల్‌లోనే శృంగారం
బాలుడి ఆర్తనాదాలు విని స్థానికులు పరుగెత్తుకొచ్చి కుక్కను తరిమేశారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం హుటాహుటిన, ఖమ్మంలోని, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు భరత్ తల్లిదండ్రులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కుక్క దాడితో ఇన్‌ఫెక్షన్‌కు గురైన బాలుడు ప్రాణాలు విడవడానికి ముందు కుక్క తరహాలో ప్రవర్తించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.