Dog Attack : మరో చిన్నారిని బలి తీసుకున్న కుక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Attack : హైదరాబాద్లోని అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన విషయం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కుక్కలు.. ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను తీశాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రఘునాథపాలెం మండలం పుటాని తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్ ఆదివారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వీధి కుక్క దాడి చేసింది.
Read Also:Florida Teacher Affair: టీచర్ వక్రబుద్ధి.. మైనర్ బాలుడితో స్కూల్లోనే శృంగారం
Also Read
బాలుడి ఆర్తనాదాలు విని స్థానికులు పరుగెత్తుకొచ్చి కుక్కను తరిమేశారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం హుటాహుటిన, ఖమ్మంలోని, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు భరత్ తల్లిదండ్రులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కుక్క దాడితో ఇన్ఫెక్షన్కు గురైన బాలుడు ప్రాణాలు విడవడానికి ముందు కుక్క తరహాలో ప్రవర్తించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.
తాజావార్తలు
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!