Palanadu Accident Case: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితులైన ఏఎస్సై కొడుకుతో పాటు అతని అనుచరులను విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్4న గణపవరం బైపాస్ సమీపంలో నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన ఏఎస్సై కొడుకు వెంకటనాయుడు, అతని అనుచరులు ఓ కంటైనర్ లారీని ఆపారు. ఇదే సమయంలో ఒక కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
READ ALSO: CM Chandrababu: ముందు సస్పెండ్, ఆ తర్వాతే మీటింగ్.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్!
సీసీ ఫుటేజ్‌లో ఏఎస్సై కొడుకు గ్యాంగ్ లారీని ఆపేందుకు ప్రయత్నించిన విజువల్స్ రికార్డయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏఎస్సై కొడుకు వెంకటనాయుడుతో పాటు అతని గ్యాంగ్ సభ్యులు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఇదే సమయంలో వెంకటనాయుడు గ్యాంగ్ గతంలో చేసిన నేరాలు, కార్ల దొంగతనాలపై ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నిందితులను మరింత లోతుగా విచారించేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన కోర్టు నిందితులను పోలీసులకు ఐదు రోజులు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నర్సరావుపేట సబ్ జైలులో ఉన్న నిందితులను ఈనెల 18 నుంచి 22 వరకూ పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు.
READ ALSO: Health Tips: బాత్రూమ్ తలుపు మూసి ఈ పని చేస్తున్నారా! అయితే డేంజర్..
