Site icon NTV Telugu

AP News: మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయుల గుర్తింపు!

Madanapalle

Madanapalle

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపధ్యంలో ఏప్రిల్ 27వ తేది వరకు దేశంలో ఉండే పాకిస్థానీయులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో భారతదేశంలో పాకిస్తాన్‌కు చెందిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయులను ఉన్నట్లు గురించారు.

ఇండియన్ ఎంబసీ సమాచారంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మదనపల్లెలో ఉంటున్నట్లు పోలీసులు గురించారు. గులాబ్ జాన్ అనే మహిళ సౌదీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొత్తంగా ఆరుగురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. గులాబ్ జాన్‌కు ఒక బిడ్డ మాత్రం ఇండియాలో పుట్టగా.. మిగిలిన ఐదుగురు సౌదీలో పుట్టారు. రెసిడెన్స్ వీసాపై మదనపల్లెలో 20 ఏళ్లుగా ఉంటూ.. అక్కడే స్థిరపడింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశం వదిలి వెళ్లాలని గులాబ్ జాన్‌కు పోలీసుల నోటీసులు ఇచ్చారు. నేడే చివరి రోజు కాబట్టి గులాబ్ జాన్‌ భారత్ వీడాల్సి ఉంది.

Also Read: Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. తొలి బ్యాట్స్‌మన్‌గా..!

ఏపీలో ఉన్న పాకిస్థాన్‌ పౌరులు ఈ నెల 27లోపు, వైద్య సేవల నిమిత్తం మెడికల్‌ వీసా మీద వచ్చిన వారు 29వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో అక్రమంగా ఉండే పాకిస్థానీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారో గుర్తించి పాకిస్థాన్‌ పంపేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 250 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు సమాచారం.

Exit mobile version