NTV Telugu Site icon

Phalsa Health Benefits: వేసవిలో ఫాల్సా పండ్లు తినండి.. గుండెకు ఎంతో మంచిది..

Phalsa

Phalsa

Phalsa Health Benefits: సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. వేసవి కాలం మండే సూర్యుడిని మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన పండ్లను కూడా తీసుకువస్తుంది. ఈ రోజుల్లో ఫాల్సా పండ్లు మార్కెట్‌లో ఎక్కువగా విక్రయించబడడాన్ని మీరు చూసే ఉంటారు. ఇది ఏప్రిల్ చివరి నుంచి కొన్ని నెలల వరకు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఎర్రటి ముత్యాలలా మెరిసిపోతూ కనిపించే ఫాల్సాపండ్లు మార్కెట్లలో సందడి చేస్తుంటాయి. అయితే మీ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఫాల్సా పండ్ల ఇండియన్‌ షెర్బెత్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇండియాలో వేసవి నెలలలో రిఫ్రెష్ డ్రింక్‌గా వినియోగిస్తున్నారు. టేస్టీగా ఉండడమే కాకుండా ఎన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది దీని శాస్త్రీయ నామం గ్రేవియా ఆసియాటికా. ఇందులో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుందాం.

సమ్మర్‌ బెస్ట్ ఫ్రూట్..
వేసవిలో లభించే ఈ పండు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫాల్సాను సమ్మర్ బెస్ట్ ఫ్రూట్ అనొచ్చు. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు శీతలీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఈ పండును డైరెక్ట్‌గా అలాగే తినొచ్చు లేదా జ్యూస్‌ చేసుకుని తాగొచ్చు. ఇది ఆరోగ్యానికి ప్రతి విషయంలోనూ మేలు చేస్తుంది.

రక్తహీనతను నివారిస్తుంది..
రక్తహీనతతో బాధపడేవారికి ఫాల్సా వినియోగం ఆయుర్వేదం కంటే తక్కువేం కాదు. దీన్ని తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగిపోయి అలసట, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో సోడియం కూడా సమృద్ధిగా ఉంటుంది, ఇది రక్తప్రవాహంలో పొటాషియం, క్లోరైడ్ స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది..
ఫాల్సా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. ఇది సమృద్ధిగా ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది పెరిగిన రక్తంలో చక్కెరను నియంత్రణలోకి తీసుకురాగలదు. అలాగే ఇందులో ఉండే యాంటీ హైపర్‌గ్లైసీమిక్ ఎఫెక్ట్ డయాబెటిక్ పేషెంట్లకు దివ్యౌషధం లాంటిది.

గుండెకు ప్రయోజనకరం
ఫాల్సాలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో కూడా బాగా సహాయపడతాయి. దీని వినియోగం రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా మొత్తం గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో మంచి మొత్తంలో పొటాషియం కూడా ఉంటుంది. ఇది కండరాలు, గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

డయేరియా నుంచి రక్షిస్తుంది..
ఫాల్సాలో పొటాషియం పుష్కలంగా ఉన్నందున, ఇది డయేరియా సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా దాని నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది. అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వేసవిలో ఈ పండును ఆనందంగా తినాలి.