Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
- భూమి వైపుగా దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు..
- నవంబర్ 19, 20 తేదీల్లో భూమికి సమీపం నుంచి వెళ్లనున్న శకలాలు..
- భూమిని ఢీకొనే అవకాశం లేదని చెబుతున్న శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asteroids: ఐదు గ్రహశకలాలు (asteroids) భూమి వైపుగా దూసుకువస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో భూమి సమీపం నుంచి ఈ గ్రహశకలాలు ప్రయాణించనున్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 10 మీటర్ల నుంచి గరిష్టంగా 120 మీటర్ల పరిమాణంలో కలిగిన ఈ అంతరిక్ష శిలలను ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఈ ఐదు గ్రహశకలాలకు 2026 VA11, 2026 TB84, 2026 VD6, 2018 NE1, 2007 WK3 అని పేర్లు పెట్టారు. ఈ ఐదు కూడా భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని అంచనా వేస్తున్నారు.
ఈ ఐదింటిలో 2026 VA11 గ్రహశకలం భూమికి అత్యంత దగ్గర నుంచి ప్రయాణిస్తుంది. ఇది నవంబర్ 19న భూమికి సుమారు 33.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. భూమి చంద్రుడి మధ్య దూరంతో పోలిస్తే ఇది దాదాపుగా 8.72 రెట్లు ఎక్కువ. ఈ గ్రహశకలం వెడల్పు సుమారు 10 నుంచి 22 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది సెకనుకు సుమారు 8.9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
Also Read
- Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
- Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
- Trump Praises India's GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
- Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
భూమి వైపు వస్తున్న గ్రహశకలాల్లో పెద్దది 2026 TB84. దీని వ్యాసం సుమారు 50 నుంచి 110 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. నవంబర్ 19, 20న భూమికి 46.4 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణిస్తుంది. మిగిలిన మూడు గ్రహశకలాలు నవంబర్ 20న భూమిని దాటి వెళ్లనున్నాయి.
2018 NE1 అనే గ్రహశకలం నవంబర్ 19న భూమికి సుమారు 63.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. దీని వ్యాసం 50 నుంచి 120 మీటర్లు ఉంటుందని అంచనా. ఈ ఐదింటిలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఇదే. ఇది సెకను సుమారు 13.3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. 2007 WK3 నవంబర్ 19న భూమికి సుమారు 54.7 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. దీని వ్యాసం సుమారు 14 నుంచి 30 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. 2026 VD6 నవంబర్ 20న భూమికి దగ్గరగా రానుంది. ఇది భూమికి సుమారు 40.1 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. దీని వ్యాసం 12 నుంచి 28 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా.
తాజావార్తలు
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
-
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
-
Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!