NTV Telugu Site icon

Fish Viral video: రైలు కాదు.. పట్టాలపై తిరుగుతున్న చేపలు! వీడియో వైరల్

Fishes On Mumbai Railway Tracks

Fishes On Mumbai Railway Tracks

Fishes on Mumbai Railway Tracks: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. కేవలం 6 గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా అక్కడ భారీ వర్షం పడింది. దాంతో ముంబై మొత్తం జలమయం అయింది. ఇళ్లులు, వీధులు, రోడ్లు.. అనే తేడా లేకుండా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.

Also Read: Mahindra XUV 700 Price: 2 లక్షలు తగ్గిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర.. నేటి నుంచే అమల్లోకి!

గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని రైలు పట్టాల మీద కూడా నీళ్లు చేరాయి. ఇది పెద్ద వింత కాకపోయినా.. రైలు పట్టాల్లో ఉన్న నీటిలో చేపలు తిరగడం విశేషం. ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పట్టాల మధ్య చేపలు తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. కొందరు అయితే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముంబైలో ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయి అని పోస్టులు పెడ్తున్నారు.