NTV Telugu Site icon

Bird Flu: బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. వాళ్లకు మాత్రం కాసుల వర్షం!

Bird Flue

Bird Flue

బర్డ్ ఫ్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించింది. వందలాది వైద్య బృందాలతో రంగంలోకి దిగింది. అటు కోళ్లఫారాలను కట్టడి చేస్తూ.. ఇటు ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ల మృత్యువాతకు కారణం బర్డ్‌ఫ్లూ‌ వైరస్ వల్లే అని తేలింది. కాగా.. ఈ వ్యాధి వల్ల పౌల్ట్రీ రైతులు భారీగా నష్టాలు చవిచూశారు.

READ MORE: Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ యుద్ధ సమయంలో పలికే నినాదం ఏదో తెలుసా? వింటే గూస్‌బంప్స్ ఖాయం..

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఈ వైరస్ అంతగా కనిపించడం లేదు. కానీ జనాలలో భయం మాత్రం పెరిగింది. విశాఖలో బర్డ్ ఫ్లూ లేనప్పటికీ అక్కడి జనాలు చికెన్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ.. నాన్‌వెజ్ లేకుండా ఉండటం కొంత మందికి కష్టం. దీంతో అలాంటి వాళ్లు చికెన్‌కి బదులుగా చేపలు, రొయ్యలపై పడుతున్నారు. దీంతో ఫిషింగ్ హార్బర్ వద్ద భారీగా జనాలు కనిపిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో చేపలు తక్కువ ధరకే దొరుకుతాయి.. అందుకే క్యూ కడుతుంటారనుకోకండి.. చేపలకు డిమాండ్ పెరుగుతుండటంతో రేట్లు అమాంతం పెంచేశారు. నెల రోజులుగా సరైన ఆదాయం రావడం లేదని.. ఇప్పుడు భారీగా తరలి వస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా వీరి జేబులు మాత్రం నిండుతున్నాయి. ప్రస్తుతం విశాఖ ఫిస్ మార్కెట్లో ప్రతి చేప కేజీ ధర రూ. 50 నుంచి రూ. 100 వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రొయ్యలు బుట్ట రూ.1500 నుంచి 2000 వరకు పెరిగింది. చేపలు రూ.800 నుంచి 600 వరకు చేరుకుంది. వంజరం రూ. 350 నుంచి 600 రూపాయలు వరకు పెరిగింది.

READ MORE: Hyundai Creta : ఒక్క కారు డెలివరీనే కాలేదు.. 1590శాతం పెరిగిన క్రెటా ఎలక్ట్రిక్ కారు