NTV Telugu Site icon

Visakha Port :విశాఖ తీరంలో తొలిసారిగా లంగరు వేసిన ప్రైవేటు క్రూయిజ్ షిప్

Private

Private

విశాఖ తీరంలో తొ లిసారిగా ప్రైవేటు క్రూయిజ్ షిప్ లంగరు వేసింది. సుమారు 200 మందితో MS ది వరల్డ్ పోర్టు సిటీకి చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ వున్న ఫార్నర్స్ ఈ క్రూయిజ్ ను ఎంగేజ్ చేసుకుంటారు. అమెరికాలో బయలు దేరిన ఈ ప్రయివేట్ క్రూయిజ్ రెండు రోజుల పాటు విశాఖలో ఉండనుంది. రెండేళ్ల క్రితం విశాఖకు క్రూజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్డోలియో ఎంప్రస్ నౌక విశాఖ – పుదుచ్చేరి – చెన్నయ్ మధ్య షటిల్ చేసింది. ఈ ఏడాది షెడ్యుల్ ఖరారైన పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేసినట్టు సమాచారం. ఇప్పటికే విశాఖలో క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించింది. రెండు వేల మంది ప్రయాణీకుల కేపాసిటీ కలిసిన ఈ ఫెసిలిటీ అందుబా టులోకి వచ్చిన తర్వాత సముద్ర పర్యాటకం నెమ్మదిగా ఊపు అందుకుంటోంది.