NTV Telugu Site icon

First Mobile Phone Call: సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదటి మొబైల్ కాల్.. మాట్లాడింది వీరే..

Mobile Phone Call

Mobile Phone Call

First Mobile Phone Call: నేటి యుగంలో ఫోన్‌లు నిత్యావసరంగా మారాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యక్తులకు కాల్ చేయడం కోసం మాత్రమే కాదు, అది అందించే అనేక రకాల ఫీచర్లు, సేవలను ఉపయోగించడం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు. మొబైల్ ఫోన్‌లు మన జీవితాలను వీలైనంత సౌకర్యవంతంగా మార్చాయి. ఏప్రిల్ 3, 1973 చరిత్రలో ఓ మరిచిపోలేని రోజుగా నిలిచింది. ఎందుకంటే ఈ రోజునే మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ కాల్‌ను మాట్లాడారు. టెలిఫోన్‌ పరిచయమైన చాలా రోజుల తర్వాత మొట్టమొదటి ‘హ్యాండ్‌హోల్డ్ మొబైల్ సెల్‌ఫోన్‌’ను మోటరోలాలో అమెరికన్‌ ఇంజినీర్ అయిన మార్టీ కూపర్ తయారు చేశారు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు తన మొబైల్‌ ఫోన్‌ నుంచి తొలిసారిగా కాల్ చేశాడు. మొట్టమొదట సెల్ ఫోన్ నుంచి తొలి కాల్ వెళ్లి ఏప్రిల్ 3 నాటికి 50 ఏళ్లు అవుతోంది. అంటే.. 1973, ఏప్రిల్ 3న మొబైల్ తొలి ఫోన్ కాల్ వెళ్లింది. న్యూజెర్సీలోని బెల్ ల్యాబ్స్ హెడ్ క్వార్టర్స్‌కు కూపర్ కాల్ చేసి మాట్లాడాడు. బెల్ ల్యాబ్ లో (ఏటీ అండ్ టీఎస్) పనిచేసే తన పోటీదారుడు జోయెల్ ఎంజెల్‌కు కాల్ చేశాడు.

Read Also: Bangalore Airport: యూఏఈ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం

21/2 పౌండ్ ప్రొటోటైప్‌ను తన చెవి దగ్గర పెట్టుకుని మోటారోలా టీమ్ ఫంక్షనల్ పొర్టబుల్ ఫోన్ కనిపెట్టిందని సంతోషంతో చెప్పాడు. ప్రొటోటైప్ DynaTAC (డైనమిక్ అడాప్టీవ్ టోటల్ ఏరియా కవరేజ్) 8000x సాయంతో తొలి వైర్ లెస్ ఫోన్ కాల్ చేశారు. ఆ తర్వాత కమర్షియల్‌గా రిలీజ్ చేసిన తొలి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. 1973లో కాల్ చేసినప్పటికీ, ఫోన్ అసలు నమూనా విడుదల కావడానికి 11 సంవత్సరాలు పట్టింది.

బరువు, సైజు ఎంతంటే?
1973లో వైర్‌లెస్ సెల్ ఫోన్ 1.1 కిలోల బరువు ఉండేది. 22.86 సెంటీమీటర్ల పొడువు ఉంది. 12.7 సెంటీమీటర్లు పరిమాణం, 4.44 సెంటీమీటర్లు వెడల్పు ఉండేది. కూపర్ మొబైల్ ఫోన్ కాన్ సెప్ట్ (రేడియో టెలిగ్రాఫ్‌ సిస్టమ్) కోసం.. 1973 నుంచి 1993 మధ్య కాలంలో మోటారోలా కంపెనీ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. 1980లో పర్సనల్ సెల్యూలర్ ఫోన్లకు సంబంధించి ప్రమోషన్ వీడియోలను రిలీజ్ చేసినట్టు ఈడీఎన్‌ నెట్ వర్క్ తెలిపింది.