NTV Telugu Site icon

Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్

Army

Army

కశ్మీర్ లోయలోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామున షోపియాన్‌లోని ఛోటిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ఉగ్రవాదులు అడవిలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఇక, అదే సమయంలో ఉగ్రవాదులను చంపడానికి భారత సైనికులు కాల్పులు ప్రారంభించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎంత మంది ఉగ్రవాదులు దాక్కున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Read Also: California: మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. హిందూ ఆలయంపై దాడి..

అయితే భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కశ్మీర్ జోన్ పోలీసులు షోపియాన్‌లోని ఛోటిగామ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది కలిసి ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారు. అయితే, ఇద్దరు నిందితులను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.

Show comments