NTV Telugu Site icon

Betting Scam : బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఫైర్ కానిస్టేబుల్.. సూసైడ్‌ లెటర్‌ రాసి

Betting

Betting

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ లెటర్‌ని రాసి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమార్. అయితే.. కృష్ణ కుమార్ వర్థన్నపేట మండలం కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త మిస్సింగ్ పైనా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కృష్ణ కుమార్ భార్య. కృష్ణ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మిల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెట్టింగ్ లో డబ్బులు పోయాయి.. నాకోసం వెతకొద్దు అంటూ లెటర్ రాసి ఇంట్లో నుంచి కృష్ణ కుమార్‌ వెళ్లిపోయాడు. భర్త లెటర్ తో టెన్షన్ పడ్డ కృష్ణ కుమార్‌ భార్య లెటర్ తో సహా పోలీసులకు తెలియజేసింది కృష్ణ భార్య. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కృష్ణ ప్రసాద్ ని ట్రాక్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు పోలీసులు. మిస్సింగ్ లో ఉన్న కృష్ణ ప్రసాద్ అన్న గుర్తించేందుకు దర్యాప్తును మొదలుపెట్టారు మిల్స్ కాలనీ పోలీసులు. కృష్ణ కుమార్‌ మొబైల్ ఫోన్ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు పోలీసుటు అనుమానిస్తున్నారు.

మిల్స్ కాలనీ సీఐ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగుల ద్వారా అనేక మంది యువత మోసపోతున్నారని, తద్వారా ఆర్థికపరమైన సమస్యలు తలెత్తి అప్పుల పాలై కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారన్నారు. ప్రస్తుతం మా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన కరీమాబాద్ కు చెందిన కృష్ణ కుమార్ వర్ధన్నపేటలో అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడని, అతను క్రికెట్లో బెట్టింగ్లు డబ్బులు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్నాననీ సూసైడ్ లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయినట్టుగా వచ్చిన ఫిర్యాదును తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా బాధితుడు కృష్ణ కుమార్ విజయవాడలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్స్ ద్వారా కనుకున్నామన్నారు. అతని సురక్షితంగా పట్టుకోవడానికి పోలీసు సిబ్బంది పనిచేస్తుందని అన్నారు. గతంలో ఒక గన్ మెన్ ఇలాంటి బెట్టింగ్ లకు పాల్పడి అప్పులపాలై విచక్షణను కోల్పోయి తన పిల్లల్ని భార్యని కాల్చి తాను కూడా కాల్చుకొని చచ్చిపోయాడని తెలిపారు. దయచేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని వారి వారి ఇళ్లల్లో కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పటికప్పుడు జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించాలని పోలీస్ శాఖ తరపున కోరుకుంటున్నామని తెలిపారు.