తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.
Also Read:Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?
ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కాలిపోయినట్లు సమాచారం. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 5 యూనిట్ల ద్వారా మొత్తం 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అగ్ని ప్రమాదం కారణంగా మూడు యూనిట్లలో 630 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.