పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడే క్రమంలో, అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగడం చోటుచేసుకుంటాయి. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్ లో గల పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోస్తుండగా బైకులోంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారుడు, బంకు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన వాహనదారుడు పెట్రోల్ పోసే పైపును ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ నుంచి తీసి కిందపడేశాడు. వెంటనే అక్కడే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో వైరల్ గా మారింది.
Also Read:Pawan Kalyan: వికసిత్ భారత్ 2047లో ఏపీది కీలక పాత్ర
అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాల్సిన సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో మంటలను ఆర్పడానికి బదులుగా నీళ్లు చల్లి మంటలను ఆర్పేశాడు బంకు సిబ్బంది. అదృష్టావశాత్తు మంటలు ఆరిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. లేకపోతే బంకు సిబ్బంది అవగాహన లేమితో భారీ ప్రమాదం చోటుచేసుకునేదని ఇది తెలిసిన వారు చర్చించుకుంటున్నారు.
