సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ కిచెన్ నుండి దట్టంగా పొగలు వెలువడ్డాయి. బిల్డింగ్ అయిదవ అంతస్తులో రెస్టారెంట్ ఉంది. భవనం నాలుగో అంతస్తులో GRT జ్యూవెలర్స్ ఉంది. అయిదవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు వెలువడ్డాయి. దీంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఉద్యోగులు, ఇతర పనులకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అగ్నిప్రమాదం ఆందోళన కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైర్, డిజార్డర్ సిబ్బంది చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి భవనం లోపల ఉన్న వారిని బయటికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Hyderabad: సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం..

Fire