Site icon NTV Telugu

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి ఏకంగా 50 ఫైర్‌ ఇంజన్లు..

Fire Accident

Fire Accident

ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని బాంకెట్ హాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో నగరంలోని 50 ఇంజిన్లను ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం. కాకపోతే బాంకెట్ హాల్ మొత్తం కాలిపోయింది. అలీపూర్లోని కార్నివాల్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘ్తాంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..

ఈ బాంకెట్ హాల్ అలీపూర్లోని నరేలా రోడ్కు సమీపంలో ఉంది. ఇక్కడ వివిధ కార్యక్రమాల కోసం ఒక పెద్ద బాంక్వెట్ హాల్ ఉంది. ఈ ప్రదేశంలోని ట్రాఫిక్ వైపు దట్టమైన నల్లని పొగ ప్రవహిస్తున్నట్లు దృశ్యాలు కనపడుతున్నాయి. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. బాంకెట్ హాల్లోని ఉక్కు, ఇనుప రాడ్స్ కాలిపోయి, హాల్ పైకప్పుకు నష్టం వాటిల్లింది.
అలీపూర్ ప్రాంతం అనేక విందు కార్యక్రమాలకి ప్రసిద్ధి చెందింది.

Exit mobile version