Site icon NTV Telugu

Fire Accident : రాజేంద్ర నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్దం..

Fire Accident

Fire Accident

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని నాలుగవ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే.. నాలుగవ అంతస్తులోని ఓ ఫ్లాట్ లో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన పక్క ఇంట్లోని వాళ్లు ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఈ ఘటనపై అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అయితే.. రెండు ఫైర్‌ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Also Read : Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్‌పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు

అయితే.. ప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నాలుగవ అంతస్తులో నుండి మంటలు చెలరేగడంతో మంటలను చూసి మిగితా ఫ్లాట్స్ యజమానులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇంట్లోని పరికరాలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు తెలిపారు. అయితే.. షాక్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version