Site icon NTV Telugu

FIR On Teacher: చెవిపై కొట్టడంతో వినికిడిని కోల్పోయిన విద్యార్థి.. ఉపాధ్యాయుడిపై ఎఫ్‌ఐఆర్‌..

Fir

Fir

FIR On Teacher: ఛత్తీస్‌గఢ్‌ బల్‌రాంపూర్‌ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై రఘునాథ్‌నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చెంపదెబ్బ కొట్టిన తర్వాత విద్యార్థి వినికిడి శక్తి కోల్పోయాడు. విద్యార్థికి చెవిలో సమస్య ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం ప్రకారం, బలరాంపూర్ జిల్లాలోని పండరి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి శుక్రవారం తన చొక్కా చేతులు ముడుచుకుని పాఠశాలకు చేరుకున్నాడు. దీనిపై అక్కడ బోధించే ఉపాధ్యాయుడు చక్రధారి సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారిని కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. చక్రధారి సార్ చెవిపై కొట్టారని పిల్లాడు చెప్పాడు. అప్పటి నుంచి చెవుల్లో వింత శబ్దం వస్తున్నట్లు., చెవులు మొద్దుబారిపోయి వేడిగాలి వచ్చినట్లు ఉందని పిల్లడు తెలిపాడు.

Duleep Trophy 2024: హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది!

ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలకు చేరుకుని అక్కడ ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం నిజమని తేలడంతో చక్రధారి సింగ్‌ను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సంజయ్ గుప్తా సస్పెండ్ చేశారు. ఈ విషయమై విద్యార్థిని తల్లి రఘునాథ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టీచర్ చక్రధారి సింగ్ అయామ్‌పై బిఎన్‌ఎస్ సెక్షన్ 115 (2), పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ 75 కింద నేరం నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ బాఘేల్ తెలిపారు. చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులను ఎవరికైనా చెబితే తమ బిడ్డను స్కూల్ నుంచి గెంటేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. పిల్లవాడికి నొప్పి పెరిగి వినికిడి సమస్య రావడంతో కుటుంబ సభ్యులు టీచర్‌ని చికిత్స చేయమని కోరగా అతను నిరాకరించాడు. దీంతో కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version