కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. గల్ఫ్ దేశాలకు వెళ్ళేందుకు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. గల్ఫ్ వెళ్లేందుకు వేలిముద్రలు రిజెక్ట్ కావడంతో ఆపరేషన్ చేయించుకుంటున్నారు కొంతమంది యువకులు.. ఏడాది పాటు వేలిముద్రలు కనబడకుండా కొత్త తరహా సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ అనంతరం దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు యువకులు చెక్కేస్తున్నారు. యువకులతో పాటు సర్జరీలు చేసే డాక్టర్ ని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు.
విదేశాలకు వెళ్లేందుకు ఏకంగా ఫింగర్ ప్రింట్స్ ని మారుస్తుందీ ముఠా. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరి. ఒకసారి గల్ఫ్ దేశాల్లో రిజెక్ట్ అయితే మళ్లీ వెళ్లడం కష్టం.. అందుకే మరోసారి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారికి వేలిముద్రల సర్జరీ చేస్తోందీ ముఠా. నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు. ఉద్యోగం లేనివాళ్ల వేలిమద్రలు తీసుకొని స్వదేశానికి పంపిస్తున్నారు యూఏఈ విదేశాంగ శాఖ అధికారులు. ఇలాంటి వేలిముద్రల ద్వారా వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే గుర్తించి తిప్పి పంపుతున్నారు అధికారులు
వేలిముద్రల సర్జరీ సమాచారం అందుకున్న రాచకొండ ఎస్ఓటి టీం రంగంలోకి దిగింది. రాజస్తాన్, కేరళ, హైదరాబాద్ ల లో 25 వేలకు ఫింగర్ ప్రింట్స్ మారుస్తుందీ ముఠా. కడపకు చెందిన ఎక్స్ రే టెక్నీషియన్ నాగ మునీశ్వర్ రెడ్డి, అనస్థీషియా టెక్నీషియన్ వెంకటరమణ, కువైట్ లో కన్‌స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న శివశంకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఇంటి దగ్గరికి వెళ్లి సర్జరీలు చేస్తుందీ ముఠా. ఇప్పటి వరకు ఈ ముఠా 11 మందికి సర్జరీ చేశారు. రాజస్తాన్ లో ఇద్దరు, కేరళలో 6 గురు, కడపలో ముగ్గురికి సర్జరీ చేశారు.
సర్జరీ చేసుకున్న ఇద్దరిని కూడా అరెస్టు చేశామన్నారు సీపీ మహేష్ భగవత్. సమాచారం అందుకొని రైడ్ చేశామన్నారు. హైదరాబాద్ లో సర్జరీ చేయడానికి వచ్చారు. సర్జరీకి సంబంధించి చిన్న అనస్థీషియా ఇస్తారు.ఏడాది వరకు ఫింగర్ ప్రింట్ రాదు.. సర్జరీ చేసుకున్న వాళ్ళు మూడు నెలల తరువాత కువైట్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు..అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ తో దొరుకుతున్నారు..కువైట్ లో ఏడురోజుల జైలుశిక్ష వేసి, తిరిగి పంపిస్తున్నారు. కువైట్ లో ఓన్లీ ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తున్నారు.. ఈ తరహా క్రైమ్ పై ఇమ్మిగ్రేషన్ అధికారులను అలెర్ట్ చేశామన్నారు రాచకొండ సీపీ. దీనికి సంబంధించిన వివరాలను కువైట్ ఎంబసీ అధికారులకు సమాచారం అందిస్తామన్నారు.
Read Also: Manchu Vishnu: షాకింగ్.. ‘మా’ ప్రెసిడెంట్ కు గాయాలు.. అంతా అతనివలనే
