NTV Telugu Site icon

Airport: ఎయిర్‌పోర్టులో యువతి చిల్లర చేష్టలు.. ఏం చేసిందంటే..!

Airport

Airport

సోషల్ మీడియాలో ఫేమస్ కోసం కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు. నలుగురు చూస్తే.. ఏమనుకుంటారన్న ఇంగిత జ్ఞానం లేకుండా హద్దులు దాటుతున్నారు. ఇటీవల హోలీ సందర్భంగా ఢిల్లీ మెట్రోలో ఇద్దర అమ్మాయిలు జుగుప్సకరంగా ప్రవర్తించారు. తమ వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఎయిర్‌పోర్టులో ఓ యువత చేసిన చేష్టలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Summer Food: వేసవిలో ఈ ఫుడ్‌ ఎక్కువగా తినొద్దు..!

తమ వీడియో వైరల్ కోసం ఏ స్థలాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో లగేజీ తీసుకు వెళ్లే కన్వేయర్ బెల్ట్‌పై అమ్మాయి పడుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని వీక్షించిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. నెటిజన్లు మాత్రం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులను కోరుతున్నారు. ఆమెకు లక్షల్లో జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 2 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.

ఇది కూడా చదవండి: Shaheen Afridi: కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై..?

ఇటీవల హోలీ పండుగ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రో రైల్లో అత్యంత హేయమైన రీతిలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా రోడ్లపై కూడా నీచంగా ప్రవర్తించారు. ఈ వీడియోలు కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారికి జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.