Site icon NTV Telugu

CIBIL Score: లోన్స్ కు లైన్ క్లియర్.. వారికి సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్రం స్పష్టం

Credit Score

Credit Score

డబ్బులు అర్జెంటుగా అవసరంపడినప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వద్ద అడుగుతారు. డబ్బు దొరక్కపోతె బ్యాంకులో లోన్ తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. కానీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్స్ మంజూరు చేస్తుంటాయి. లేదంటే లోన్ అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఇదే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మొదటి సారి లోన్లు తీసుకునేవారికి మినిమమ్ సిబిల్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాల్సిన అవసరం లేదని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.

Also Read:Mega Star : మెగా స్టార్ ప్లానింగ్ మాములుగా లేదు.. వచ్చే రెండేళ్లు రఫ్ఫాడించబోతున్నారుగా

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ, క్రెడిట్ స్కోరు లేకపోయినా బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించలేవని స్పష్టం చేశారు. కానీ, బ్యాంకులు దరఖాస్తుదారుల బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నిబంధనల ప్రకారం, క్రెడిట్ స్కోరు వివరాలు అందించేందుకు క్రెడిట్ బ్యూరోలు యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.100 కంటే ఎక్కువ వసూలు చేయకూడదని తెలిపారు.

Exit mobile version