Site icon NTV Telugu

Buggana Rajendranath Reddy: త్వరలోనే వైజాగ్ నుంచే పరిపాలన ప్రారంభం

Buggana 1

Buggana 1

ఏపీలో మూడురాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. విభజన సమయంలో రెవిన్యూ లోటు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. ఉద్యోగుల జీతాలు ఒకటి,రెండు రోజులు లేట్ అవడం కొత్తేమీ కాదు… గతంలోనూ జరిగాయి. 1920 శ్రీబాగ్ ఒప్పందం అంటే వికేంద్రీకరణ అందరికీ తెలిసిందే.

Read Also: Rana Naidu Trailer: నేను నీ బాబును రా.. వెంకీ- రానాల నట విశ్వరూపం

తెలంగాణ విషయం వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణకు మొగ్గు చూపింది. శివరామకృష్ణ కమిటీ మన పార్లమెంట్ ఒక చట్టపరంగా వికేంద్రీకరణ మంచిదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్వరగా అభివృద్ధి కావాలన్నా కూడా వైజాగ్ మంచిదని నిర్ణయించాం. చంద్రబాబు మీటింగ్ లో 12 మంది చనిపోయారు… అందుకే రూల్స్ పాటించమన్నాం …కొత్తగా రూల్స్ ఆంక్షలు పెట్టలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నగరం అభివృద్ధికి వైజాగ్ సెట్ అవుతుంది. రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం పరిగణలోకి తీసుకొని హైకోర్టు వివిధ న్యాయ ట్రిబ్యూనల్స్,కమిషన్లు కర్నూలలో ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి బుగ్గన.

బెంగళూరు మీటింగ్ లో కూడా కూడా చెప్పాం ….వైజాగ్ అన్నిటికీ మేలు. దేశంలోని 8 రాష్ట్రాల్లో కోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉంది. మూడు రాజధానులు పెట్టింది… అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం అన్నారు మంత్రి. రోడ్ల కోసం గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టాం…. తక్కువ అప్పు చేసాం. కోవిడ్ లో కూడా ఎక్కువే ఖర్చు చేశాం. కోర్టు,రాజధాని,పరిపాలన అంటే కొంతమంది ఒకే చోటే నా అని తనకున్న మీడియా శక్తితో ప్రాపగండా చేస్తున్నారు అని చంద్రబాబుపై మండిపడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

Read Also: Off The Record: డొక్కాను ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా?

Exit mobile version