Site icon NTV Telugu

UI The Movie : రిలీజ్ కి రెడీ అయిన ఉపేంద్ర క్రేజీ ప్రాజెక్ట్ ‘యూఐ’

New Project (39)

New Project (39)

UI The Movie : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. ఆయన ఒక్క కన్నడలోనే గాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ హీరో. ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీశారు. అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ గా ఆయన సినిమాలు ఉండేవి. అయితే ఉపేంద్ర డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టి కొన్నేళ్లు అయింది. దర్శకుడిగా చివరిగా తొమ్మిదేళ్ల కింద ఉప్పి2 సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు ‘UI’ అనే సినిమాతో దర్శకుడిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా చేస్తున్న ‘UI’ నుండి ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ టీజర్ తోనే తన మార్క్ చూపిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాని ప్రజెంట్ చేశారు.

Read Also:Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇట్స్ ఆఫీసియల్..

కొన్నాళ్లుగా తన కొత్త సినిమా గురించి పెద్దగా అప్ డేట్స్ ఏమీ లేవు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందా అంటూ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ ఎట్టకేలకు సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చేసింది చిత్రబృందం. UI సినిమా గురించి రిలీజ్ అప్ డేట్ ని ఒక మోషన్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆ పోస్టర్ లో ఉపేంద్ర ఒక శ్మశానం లాంటి ఏరియాను శాసించే గెటప్ లో కూర్చుని ఉన్నాడు. ఇక UI సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే బహుశా దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:Vijay Sethupathi : ఆ కుటుంబానికి అండగా నిలబడిన విజయ్ సేతుపతి..బాసూ నువ్వు గ్రేట్

UI సినిమా మొత్తం ఉపేంద్ర మార్క్ స్టైల్లోనే ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఇంతకు ముందు వచ్చిన అప్డేట్స్, సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక ఉపేంద్ర తన కెరియర్లో దర్శకత్వం వహిస్తున్న 11వ సినిమా ఇది. దాదాపు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో జి. మనోహరన్, పి. శ్రీకాంత్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఉపేంద్ర ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్స్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో 80శాతం వరకు గ్రాఫిక్స్ ఉంటాయని కూడా తెలియజేశారు. ఉపేంద్ర తో రీష్మా , సన్నీలియోన్, నిధి సుబ్బయ్య , ఇంద్రజిత్ లంకేష్, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version