NTV Telugu Site icon

Filmfare Awards 2023: ఆర్ఆర్ఆర్ చిత్రానికి 7 అవార్డులు.. తెలుగు అవార్డ్స్ లిస్ట్ ఇదే!

Filmfare Awards South Telugu 2023

Filmfare Awards South Telugu 2023

Filmfare Awards South Telugu 2023 Winners List: 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని అవార్డులని ప్రకటించారు. బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 అవార్డులు వచ్చాయి. క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు రాగా.. నక్సల్‌ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ దక్కాయి.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 తెలుగులో ఉత్తమ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్) విభాగంలో సీతారామం అవార్డు గెలుచుకోగా.. ఉత్తమ దర్శకుడుగా ఎస్ఎస్ రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ నటుడు విభాగంలో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్.. ఉత్తమ నటిగా మృణాల్ ఠాకుర్ నిలిచారు. ఉత్తమ సహాయ నటుడుగా రానా దగ్గుబాటి, ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్ అవార్డు గెలుచుకున్నారు. తెలుగు అవార్డ్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు) లిస్ట్:
# ఉత్తమ సినిమా – ఆర్ఆర్ఆర్
# ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి
# ఉత్తమ మూవీ (క్రిటిక్స్) – సీతారామం
# ఉత్తమ నటుడు – రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్ (సీతారామం)
# ఉత్తమ నటి – మృణాల్ ఠాకుర్ (సీతారామం)
# ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయిపల్లవి (విరాటపర్వం)
# ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
# ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం)
# ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి – (కానున్న కల్యాణం – సీతారామం)
# ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) – కాల భైరవ (-కొమురం భీముడో – ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) – చిన్మయి (ఓ ప్రేమ – సీతారామం)
# ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు – ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)

 

Show comments