Film Workers Strike: సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకి చేరుకున్న సంగతి విధితమే. అయినా కానీ కార్మికుల సమస్యలపై ఎంటువంటి నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు. ఈ పరిస్థితులలో హైదరాబాద్‌లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత 17 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె ప్రభావం రాష్ట్ర సినిమా పాలసీపై పడుతుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె పెద్ద అడ్డంకిగా మారిందని అధికారులు భావిస్తున్నారు.
తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఇక ఈరోజు ఫెడరేషన్ నాయకులతో కూడా చర్చలు జరపనున్నారు. ఇక కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నట్టు సమాచారం. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ కీలక చర్చలు నిర్వహించనుంది. చూడాలి మరి ఈరోజు అయినా వారి సమస్యకు ఎండ్ కార్డు పడుతుందో లేదో..
Suicide Attempt: దారుణం.. ఇద్దరు చిన్నారులను సంపులో పడేసిన తల్లి.. తాను ఆత్మహత్య హత్యాయత్నం!
