Site icon NTV Telugu

Big Breaking: మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం..

Masab Tank

Masab Tank

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌ ఆఫీస్‌లో ఫైల్స్‌ మాయమైనట్లు తెలుస్తోంది. కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఫైల్స్‌ ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే ఫైల్స్ మిస్సింగ్ పై ఓఎస్డీ కల్యాణ్‌, ఆపరేటర్‌ మోహన్‌ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖలోని ముఖ్యమైన ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాగా.. ఫైల్స్‌ నిన్ననే మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఘటనాస్థలంలో డీసీపీ శ్రీనివాస్‌ ఆధారాలు సేకరించారు. కాగా.. డైరెక్టర్‌ను సెంట్రల్‌ డీసీపీ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఫైల్స్‌ అదృశ్యంపై తమకు సమాచారం లేదని డైరెక్టర్‌ తెలిపారు. ఫైల్స్‌ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Exit mobile version