Site icon NTV Telugu

Fighter jet crashes: భవనంపై కుప్పకూలిన యుద్ధవిమానం.. చెలరేగిన మంటలు

Russian Fighter Jet

Russian Fighter Jet

Fighter jet crashes: రష్యాలోని యేస్క్ నగరంలో తొమ్మిదంతస్తుల నివాస భవనంపై ఒక సైనిక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో భవనాన్ని మంటలు వ్యాపించాయి. మొదటి అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తు వరకు మంటలు చెలరేగినట్లు సంఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యుద్ధ విమానం ఇంజిన్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఈ ప్రమాదం జరిగింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బహుళ అంతస్తుల భవనం నుంచి పెద్ద అగ్నిగోళంలా మంటలు చెలరేగిన సోషల్‌ మీడియాలో ధ్రువీకరించని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి.

విమానం సుఖోయ్-34 ఫైటర్ జెట్‌గా గుర్తించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, విమానం కూలిపోయే ముందు సిబ్బంది బయటకు వెళ్లగలిగారు. జెట్ ఇంధనంతో మంటలు చెలరేగడంతో భవనంపై పెద్ద మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అపార్ట్‌మెంట్ భవనంలోని ఐదు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయని, పై అంతస్తులు కూలిపోయాయని, దాదాపు 45 అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయని స్థానిక అత్యవసర మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఇంటర్‌ఫాక్స్ పేర్కొంది.

Innocent Complaint: అమ్మ నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను జైల్లో పెట్టండి.. తల్లిపై బాలుడి ఫిర్యాదు

యేస్క్‌ నగరం అజోవ్ సముద్ర తీరంలో ఉంది. ఇది దక్షిణ ఉక్రెయిన్, దక్షిణ రష్యాను వేరు చేస్తుంది. రష్యా దర్యాప్తు కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి విధ్వంసం జరిగింది. అయినా ఈ ఘటనలో  నష్టంతో పాటు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

https://twitter.com/maryilyushina/status/1582041666483257344

Exit mobile version