Site icon NTV Telugu

LSG vs SRH: అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ.. తీరు మార్చుకోని దిగ్వేష్

Digvesh

Digvesh

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు లక్నోను 6 వికెట్ల తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్‌కు చేరుకునే లక్నో ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ జరిగింది. దిగ్వేష్ ఓవరాక్షన్ తో గందరగోళ పరిస్థితి తలెత్తింది. దిగ్వేష్ సింగ్ రాఠి, అభిషేక్ శర్మ మధ్య తీవ్ర వాదన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Also Read:Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. వారిని ఉరితీసినా తప్పులేదు..

206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్ ధాటిగా ఆడింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేయడానికి దిగ్వేష్ సింగ్ రాఠి వచ్చాడు. ఈ ఓవర్‌లో అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీని తరువాత, అభిషేక్‌ను చూసిన దిగ్వేష్ రాఠి తన పాత శైలిలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అభిషేక్ శర్మను స్టేడియం వదిలి వెళ్ళమని కూడా సంజ్ఞ చేశాడు.

Also Read:Jananayagan : జననాయగన్ ట్విస్ట్.. ఒక ఎపిసోడ్ కోసమే 4.5 కోట్లు

దీనిపై అభిషేక్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దిగ్వేష్ సెలబ్రేషన్స్ గతంలో కూడా వివాదాస్పదమైంది. ఎందుకంటే కొంతమంది ఆటగాళ్ళు, అభిమానులు దీనిని అభ్యంతరకరంగా భావించారు. దిగ్వేష్ రాఠి తన ‘నోట్‌బుక్’ వేడుక కారణంగా సీజన్ ప్రారంభం నుంచి వార్తల్లో నిలిచాడు. దీని కారణంగా అతనికి ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించారు. అయినప్పటికీ దిగ్వేష్ తీరు మార్చుకోకపోవడంతో క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు.

Exit mobile version