14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 Argentina: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్ 2026లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో చివరి 14 నిమిషాల్లో 3 గోల్స్ చేసి ఈజిప్ట్‌పై 3-2తో సంచలన విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది. ఒక దశలో 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడిన అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అద్భుతంగా పుంజుకుని క్వార్టర్ లోకి అర్హత సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాధించిన ఈ మ్యాచ్ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
ఈజిప్ట్ మాయ:
మ్యాచ్ ప్రారంభం నుంచే బంతిపై అర్జెంటీనా ఆధిపత్యం చెలాయించినా.. గోల్ మాత్రం ఈజిప్ట్ ఖాతాలో పడింది. 15వ నిమిషంలో యాసిర్ ఇబ్రహీం కార్నర్ కిక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచి ఈజిప్ట్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పెనాల్టీ రూపంలో అర్జెంటీనాకు సమం చేసే అవకాశం వచ్చినా, మెస్సీ కొట్టిన స్పాట్ కిక్‌ను ఈజిప్ట్ గోల్‌కీపర్ మొస్తఫా షోబిర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా వరుస దాడులు చేసినప్పటికీ.. ఈజిప్ట్ రక్షణ శ్రేణి గోడలా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లోనే అలెక్సిస్ మెక్ అలిస్టర్, జూలియన్ అల్వరెజ్ చేసిన ప్రయత్నాలను కూడా షోబిర్ సమర్థంగా అడ్డుకోవడంతో అర్జెంటీనా వెనుకపడింది. ఇక రెండో ఆర్థంలో కూడా అర్జెంటీనా దాడులు కొనసాగించినా ఫలితం కనిపించలేదు. 67వ నిమిషంలో మొస్తఫా జికో మరో అద్భుత గోల్ చేయడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే మ్యాచ్‌లో మరో 20 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో డిఫెండింగ్ ఛాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ఆశ్చర్యపరిచిన అర్జెంటీనా:
చివరి 20 నిమిషాలలో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 79వ నిమిషంలో మెస్సీ ఇచ్చిన అద్భుత క్రాస్‌ను క్రిస్టియన్ రొమెరో హెడర్ తో గోల్‌గా మలిచి అర్జెంటీనాకు ఆశలు కల్పించాడు. ఆపై నాలుగు నిమిషాలకే లాటారో మార్టినెజ్ పాస్‌ను అందుకున్న లియోనెల్ మెస్సీ పవర్ఫుల్ షాట్‌తో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఇక ఇంజరీ టైమ్‌లో కూడా దాడులు ఆపని అర్జెంటీనా చివరకు 90+2వ నిమిషంలో విజయగోల్ నమోదు చేసింది. మార్టినెజ్ అందించిన క్రాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ హెడర్‌తో గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం అర్జెంటీనా అభిమానుల సంబరాలతో మార్మోగిపోయింది. 14 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ సాధించిన అర్జెంటీనా అసాధారణ విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ దూకుడు:
ఈ మ్యాచ్‌లో కీలక గోల్ చేసిన లియోనెల్ మెస్సీ ప్రస్తుత ప్రపంచకప్‌లో తన గోల్స్ సంఖ్యను 8కు పెంచుకున్నాడు. దీంతో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ చెరో 7 గోల్స్‌తో మెస్సీకి పోటీగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!