NTV Telugu Site icon

Feroz Khan : ఎంఐఎంకి ఫిరోజ్ ఖాన్ అంటే భయం.. అందుకే దాడులు చేస్తుంది

Feroz Khan

Feroz Khan

ఎంఐఎంకి ఫిరోజ్ ఖాన్ అంటే భయం .. అందుకే దాడులు చేస్తుందంటూ నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాంట్లో ఓ వ్యక్తి పడి తల పగిలిందని, అతన్ని పరామర్శించడం కోసం వెళ్ళానన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే తన గుండాలతో వచ్చి దాడి చేశారని ఆయన ఆరోపించారు. లంగపని..దొంగ పని నేను చేయనని ఆయన అన్నారు. విచిత్రం ఏంటంటే.. పోలీసులు ఎంఐఎం వాళ్లపై పెట్టిన కేసులే మా పై పెట్టారన్నారు. తప్పు చేసింది వాళ్ళు.. ఇద్దరిపై కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో ఎంఐఎం కలిసి పని చేస్తుందని ఫీలింగ్ ఉందని, రేపు సీఎంనీ కలిసి అడుగుతా.. జరిగిన సంఘటన వివరిస్తానన్నారు. బీఆర్‌ఎస్‌ కానీ.. బీజేపీ అధికారంలో ఇంటే ఎంఐఎం ఎమ్మెల్యే మీద కేసులు బుక్ అయ్యేవన్నారు. బీఆర్‌ఎస్‌ లూటీ చేసింది అనే కదా కాంగ్రెస్‌నీ అధికారంలోకి తెచ్చారు ప్రజలు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం ఉందన్నారు ఫిరోజ్‌ ఖాన్‌.

Stock market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Show comments