Fenugreek Farming : మెంతుల సాగులో మెళుకువలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో మెంతులు ఉంటాయి.. చేదుగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మన తెలుగు రాష్ట్రాల్లో మెంతులను ఎక్కువగా పండిస్తున్నారు.. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. ఇక మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్, శ్రీలంక, కొరియా , ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.. ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. పంట ఆకు కూరగా సాగు చేస్తే 25 రోజులు గింజల కోసమైతే 100 రోజుల సాగు వ్యవధి ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో నైనా పెరుగుతుంది. చలి , గడ్డకట్టే వాతావరణాన్ని తట్టుకోగలదు..
బంకమట్టి , క్షారగుణం కలిగిన నేలలు అనుకూలం.. ఇక మెంతులలో రకాలు.. కో 1, రాజేంద్ర కాంతి, ఆర్ ఎంటి 1, లాం సెలక్షన్ 1 , కసూరి, ఆర్ ఎం టి 143, మేధి నెం 47, మేధి నెం 14, ఇసి 4911, హెచ్ 103, హిస్సార్ సొనాలి వంటి రకాలు అధిక దిగుబడిని అందిస్తాయి.. ఇకపోతే ఈ పంట వేసే ముందు మూడు సార్లు భూమిని బాగా దున్నాలి.. మడులను తయారు చేసుకొని , వాటిపై విత్తనాన్ని వెదచల్లుకోవాలి. వరుసల మధ్య 20 సెంమీ దూరం ఉండేటల్లు నాటుకుంటే అంతర కృషి సులభంగా చేసుకునే వీలుకలుగుతుంది…
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ఇకపోతే చలికాలంలో అంటే నవంబర్ లో ఈ పంటను విత్తుకోవడానికి అనుకూలం..హెక్టారుకు 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తిన 8 రోజుల్లో విత్తనం మొలకెత్తటం ప్రారంభమౌతుంది. ఎరువుల విషయానికొస్తే.. 25 కిలోల నత్రజని , 25 కిలోల భాస్వరం , 50 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. సగం నత్రజని ఎరువు, మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి… మెంతి ఆకులను కత్తిరించినప్పుడు నత్రజని ఎరువులు వేసుకోవాలి.. పది రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాలి.. ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!