NTV Telugu Site icon

Jani Master: నేషనల్ అవార్డు సాధించిన జానీ మాస్టర్‌కు సన్మానం

Jani Master

Jani Master

Jani Master: టాలీవుడ్ స్టార్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్‌ ఒక తమిళ సినిమాకు నేషనల్‌ అవార్డును దక్కించుకున్నారు. తిరుచిత్రంబళం సినిమాలో మేఘం సాంగ్‌కి గాను జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో తిరు పేరుతో ఈ సినిమాను రిలీజ్‌ చేశారు. జాతీయ అవార్డు సాధించిన జానీ మాస్టర్‌ను తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్ కారణంగా ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ఆయన స్వస్థలం నెల్లూరు.

Read Also: Rampothineni : హ్యాట్రిక్ కొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్.. ఫ్లాప్ దర్శకుడితో రెడీ

అనిరుద్ మ్యూజిక్ అందించిన తిరుచిత్రంబళం సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గాను జానీ మాస్టర్ చేసిన మేఘం కరిగేనా అనే సాంగ్ కొరియోగ్రఫీ చూసిన జ్యూరీ మెంబర్లు ఫిదా అయిపోయారు. కానీ ఈ అవార్డుని ఆయన మరొక కొరియోగ్రాఫర్‌తో కలిసి పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సతీష్ కృష్ణన్‌తో కలిసి జానీ మాస్టర్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు.