NTV Telugu Site icon

FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్‌ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!

Fedex1

Fedex1

ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. తాజాగా ఇదే బాటలో నడిచింది ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ఫెడ్‌ఎక్స్‌. అమెరికాలో ఇప్పటికే 12వేల మంది సాధారణ ఉద్యోగులను తొలగించిన సంస్థ ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునేందుకు నిర్ణయంచింది. షిప్పింగ్ మందగమనం నేపథ్యంలో ఫెడెక్స్ కార్ప్ తన గ్లోబల్ మేనేజ్‌మెంట్ సిబ్బందిలో 10 శాతం కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈమేరకు తమ సిబ్బందికి ఈమెయిల్‌ సమాచారాన్ని అందించింది. అలాగే కంపెనీ ఆఫీసర్ , డైరెక్టర్ ర్యాంక్‌ల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు , కొన్ని టీంలను కలిపివేస్తున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజ్ సుబ్రమణ్యం వెల్లడించారు. సంస్థ అభివృద్ధి కోసం దురదృష్టవశాత్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు.

Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఆరోజునే..!

ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. కొన్ని సంస్థలు ఏకంగా రెండు, మూడుసార్లు లేఆఫ్స్ బాటలో నడిచాయి. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ ఇలా వరుసపెట్టి కంపెనీలు ఉద్యోగులకు షాకిచ్చాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ పని కొనసాగిస్తున్నారు.