Site icon NTV Telugu

22-02-2022: ఈరోజు చాలా స్పెషల్.. ఎందుకంటే..?

ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి రోజుల కోసం చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మరి ఇవాళ కూడా ప్రత్యేకమైన రోజే. ఈ రోజు తేదీ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు తేదీలో 2 అనే సంఖ్య ఆరు సార్లు కనిపిస్తుంది. 22వ తేదీ, రెండో నెల.. 2022 సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.02.2022ను సూచిస్తుంది.

ఈ రోజు తేదీని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు చూసినా ఒకేలా కనిపించే అరుదైన తేదీ ఇది. ఇలా ఉండటాన్ని పాలిండ్రోమ్ (palindromeday), అంబిగ్రామ్ (ambigram) అని పిలుస్తారు. పాలిండ్రోమ్ అంటే ముందు నుంచి, వెనుక నుంచి చదివితే అదే అర్థం వ‌స్తుంది. అంబిగ్రామ్ అంటే.. పై నుంచి, కింది నుంచి చ‌దివినా అదే అర్థం వ‌స్తుంది. కాక‌పోతే.. 2 అనే అంకెను డిజిట‌ల్ క్లాక్ ఫార్మాట్‌లో రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఈరోజు 20:22 (8:22pm)కి సంబరాలు మొదలుపెట్టి 22:22 (10:22pm) వరకు జరుపుకుంటారు.

Exit mobile version