Site icon NTV Telugu

Delhi: దేశ రాజధానిలో దారుణం.. తండ్రీకొడుకులు హత్య

Kde

Kde

దేశ రాజధానిలో ఢిల్లీలో దారుణం జరిగింది. ఇరుగుపొరుగు గొడవల్లో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

చిరాగ్ ఢిల్లీ ఏరియాలో ఏదో విషయంలో ఇరుగుపొరుగు వారు గొడవలకు దిగారు. అనంతరం ప్రత్యర్థులు కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో జై భగవాన్ (55), అతని కుమారుడు సౌరభ్(22) ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. మృతులిద్దరూ కేబుల్ వర్కర్లుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 8 గంటలకు జరిగినట్లుగా వెల్లడించారు.

ఆదివారం రాత్రి 8 గంటలకు సమాచారం వచ్చిందని.. తన తండ్రిని ఎవరో కత్తితో పొడిచి చంపారని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని సౌత్ డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపారు. సంఘటనాస్థలికి చేరుకోగానే జై భగవాన్, అతని కుమారుడిని 4-5 మంది వ్యక్తులు కత్తితో పొడిచినట్లు గుర్తించారు. దర్యాప్తు జరుగుతోందన్నారు.

ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ప్రధాన కారణం ప్రత్యర్థేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. హంతకులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కొన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

 

https://twitter.com/sagarmalik1985/status/1767071012246655343

 

Exit mobile version