NTV Telugu Site icon

UP: వీళ్లు మనుషులేనా..! నమ్మి వచ్చిన ప్రియురాలిపై.. ప్రియుడు, తండ్రి దారుణం

Up Marriage

Up Marriage

యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి కోసం వస్తే.. ప్రియురాలిపై యువకుడి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు.. ప్రియుడు, ప్రియురాలు వీరి పెళ్లి కోసం నకిలీ పత్రాలు తయారు చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు ఆమెను ఇంటికి తీసుకురాగా.. తండ్రీకొడుకులు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. అయితే.. ఆ ఇద్దరి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తండ్రీకొడుకులపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Hamas-Israel War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల ప్రయోగం

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోహదా కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి.. బండ గ్రామానికి చెందిన బాలిక తన కుటుంబంతో కలిసి ఘతంపూర్‌లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తుండేది. పట్టణంలోని ఫతేపూర్‌కు చెందిన యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషంగా గడుపుదామని కూడా ప్రమాణం చేసుకున్నారు. కాగా.. జులై 26న మౌదాహాలోని ప్రేమికుడి వద్దకు ప్రియురాలి వెళ్లింది. దీనిపై యువతి తండ్రి యువకుడిపై ఫిర్యాదు చేశాడు. కాగా.. విచారణలో భాగంగా.. ప్రియుడి ఇంటికి వెళ్లిన పోలీసులకు తండ్రి మాయమాటలు చెప్పాడు. బాలిక వయసు తక్కువ ఉన్నందున నకిలీ పత్రాలు సిద్ధం చేసి ఆలయంలో పెళ్లి చేసుకున్నారని చెప్పాడు.

Raksha Bandhan: రక్షాబంధన్ రోజు సాలరీ కట్.. హక్కుల కోసం మాట్లాడితే ఉద్యోగం పోయింది..

ఆ తర్వాత బాలికను ప్రియుడి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్పటినుంచి.. తండ్రీకొడుకులు తమపై నిరంతరం అత్యాచారం చేస్తున్నారని బాలిక ఆరోపించింది. ఎలాగోలా వారిద్దరి బారి నుంచి బయటపడ్డానని.. కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కూతురితో కలిసి మొహడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ప్రేమికుడు, అతని తండ్రిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show comments