Site icon NTV Telugu

Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?

Up

Up

ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పారిపోవడం, కాబోయే కోడలిని మామ పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాంపూర్‌లోని ఓ మామ తనకు కాబోయే కోడలిని వివాహం చేసుకున్నాడు. బన్సనాలి గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు పిల్లల తండ్రి తన మైనర్ కొడుకు వివాహాన్ని మొదట బలవంతంగా ఒక అమ్మాయితో నిశ్చయించి, ఆ తర్వాత అదే అమ్మాయితో పారిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొడుకు వివాహం నిశ్చయించిన తర్వాత, మామ తన కాబోయే కోడలితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడేవాడని, క్రమంగా అది వీడియో కాల్‌కు దారితీసిందని చెబుతున్నారు.

Also Read:Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు బెదిరింపులు.. బెంగళూరు వైద్యురాలు అరెస్ట్

సమాచారం ప్రకారం, బన్సాంగ్లి గ్రామానికి చెందిన షకీల్ అనే వ్యక్తి తన మైనర్ కొడుకు వివాహం సమీపంలోని ఖేంపూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో కుదిర్చాడు. ఈ సంబంధానికి కుటుంబం అభ్యంతరం చెప్పినప్పుడు, షకీల్ తన భార్య, పిల్లలను కొట్టి ఈ సంబంధానికి ఒప్పించాడు. పెళ్లి నిశ్చయమయ్యాక తన భర్త షకీల్ కాబోయే కోడలు ఫోన్ లో మాట్లాడుకోవడ ప్రారంభించారని అతని భార్య తెలిపింది. వీడియో కాల్స్ కూడా చేసుకునే వారని తెలిపింది. దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు షకీల్ నాపై పిల్లలపై దాడికి పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read:Netanyahu: ఆమెరికా ఆదేశాల కోసం ఎదురుచూడలేం.. అణు స్థావరాలను మేమే ధ్వంసం చేస్తామన్న నెతన్యాహు

తన భర్త రూ. 2 లక్షల నగదు, ఒకటిన్నర తులాల బంగారంతో ఇంటి నుంచి పారిపోయాడని షకీల్ భార్య చెప్పింది. నా భర్త నా కొడుకుతో వివాహం నిశ్చయించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎవరి నుంచి న్యాయం కోరుకోవాలి?అని షకీల్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. నాకు కాబోయే భార్యతో పారిపోయి ఆమెను వివాహం చేసుకుని సమాజంలో తలెత్తుకోకుండా చేశాడని షకీల్ కుమారుడు చెప్పాడు.

Exit mobile version