NTV Telugu Site icon

Horrible Accident : ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు.. 8మంది మృతి

Madhya Pradesh

Madhya Pradesh

Horrible Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్నా సరిహద్దులో ఆగివున్న రెండు బస్సులను ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి ఒక బస్సు రెండు భాగాలుగా విడిపోగా, మరొకటి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం ఎంపీలోని బర్కడ గ్రామంలోని మోహానియా టన్నెల్ వద్ద చోటు చేసుకుంది బస్సులో ప్రయాణిస్తున్న వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీకి వెళ్లి తిరిగివస్తున్నట్లు సమాచారం.

ప్రమాదానికి ట్రక్కు టైర్ పగలడం కారణమని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో 10 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రెండు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్‌ మహాకుంభ్‌ పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.

మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. సిద్ధి లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.