National Conference: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సి) చీఫ్ పదవికి ఫరూక్ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు. శ్రీనగర్ లో తన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. వయసు మీద పడుతున్న నేపథ్యంలో, అనారోగ్య సమస్యల కారణంగా పార్టీని నడిపించే శక్తి ప్రస్తుతం తనకు లేదని ఆయన ప్రకటించారు. దీని కారణంగానే ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కొత్త పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్ 5వతేదీన ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు ఫరూక్ అబ్దుల్లానే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మరోవైపు ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ… నేతలందరూ కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. స్థానికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని… పార్టీ నాయకులు వారికి అండగా ఉండాలన్నారు. వారితో కలిసి పని చేయాలని చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని కొత్త తరం చేపట్టాల్సిన సమయం ఆసన్నమయిందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్
