National Conference: ఫరూక్ అబ్దుల్లా సంచలన నిర్ణయం.. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Conference: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సి) చీఫ్ పదవికి ఫరూక్ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు. శ్రీనగర్ లో తన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. వయసు మీద పడుతున్న నేపథ్యంలో, అనారోగ్య సమస్యల కారణంగా పార్టీని నడిపించే శక్తి ప్రస్తుతం తనకు లేదని ఆయన ప్రకటించారు. దీని కారణంగానే ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కొత్త పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్ 5వతేదీన ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు ఫరూక్ అబ్దుల్లానే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మరోవైపు ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ… నేతలందరూ కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. స్థానికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని… పార్టీ నాయకులు వారికి అండగా ఉండాలన్నారు. వారితో కలిసి పని చేయాలని చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని కొత్త తరం చేపట్టాల్సిన సమయం ఆసన్నమయిందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్
Also Read
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!