NTV Telugu Site icon

Bharat Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్.. రైలు పట్టాలపై పడుకొని రైతన్న నిరసన..

Farmers

Farmers

Farmers protest: నేడు భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్తి కిసాన్ మోర్చా పిలుపు మేరకు మరో 11 డిమాండ్ల కోసం రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ భారత్ బంద్ కొనసాగనుంది. అయితే, ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. పంజాబ్‌లోని చాలా చోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుంటున్నారు. రైతుల ఈ ఉద్యమం కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పంజాబ్ లోని లూథియానా- సాహ్నేవాల్- చండీగఢ్ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించారు.

Read Also: Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?

ఇక, ఈ దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పనులు మూసివేయాలని కోరారు. చాలా చోట్ల హైవేలపై ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్ బంద్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో పాటు సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Karnataka: పెళ్లం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని భర్త సూసైడ్..

అయితే, భారత్ బంద్ ప్రభావం మొదలైంది.. దేశంలోని చాలా చోట్ల రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధనాలు చేస్తున్నారు. పంజాబ్‌లో మూడు వేల ప్రభుత్వ బస్సుల రాకపోకలను నిలిపివేసింది. అయితే, అంబులెన్స్‌లు, పెళ్లిళ్ల వాహనాలు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఈ భారత్ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కోరారు. కాగా, మరోసారి ఆదివారం రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నాలుగో రౌండ్ చర్చలు జరగాల్సి ఉంది.