చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో గజరాజులు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. సోమల(మం)కొత్తూరు వద్ద రైతు పై ఏనుగుల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో పొలం పనులు చేస్తున్నరైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు.. రైతు రామకృష్ణ రాజు చనిపోయిన ఆ మృతదేహం వద్ద సూమారు 16 ఏనుగులు గుంపు తిష్ట వేసుకుని ఉన్నాయి. గత మూడురోజుల నుంచి తిష్ట వేసిన ఏనుగుల గుంపు ఈరోజు రైతుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Also Read:China Piece: ఆసక్తికరంగా ‘చైనా పీస్’ టీజర్
ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీల సహాయంతో ఏనుగులను తరమడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.. గ్రామస్థులపై ఏనుగుల గుంపు దాడిచేస్తాయోమో అని భయంతో వణికిపోతున్నారు. గ్రామస్థులంతా రోడ్లపైకి చేరి ఆందోళనకు గురవుతున్నారు. గజ రాజుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమి వేశారు అటవీశాఖ అధికారులు. ఏనుగుల గుంపు తరచుగా వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
