Pochampally Srinivas : ఫాంహౌస్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ
- ఫాంహౌస్ కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ
- కోడిపందేలు, క్యాసినో ఆరోపణలు – పోలీసుల దాడులు, కేసు నమోదు
- రాజకీయ కుట్రగా అభివర్ణించిన శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pochampally Srinivas : ఫాంహౌస్ కేసులో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణలో, ఫాంహౌస్ లీజుకు సంబంధించిన వివరాలను, ఘటనకు సంబంధించి ఆయన పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం.
విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట న్యాయవాది , ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఉన్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పోచంపల్లి, తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు. “పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర,” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
గత నెలలో, హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా 61 మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో భాగంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపించగా, తొలుత ఆయన తన న్యాయవాదిని పంపారు. అయితే, వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మరోసారి నోటీసులు జారీ చేయడంతో, చివరకు నేడు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Crime: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్..
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!