NTV Telugu Site icon

Faria Abdullah : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న ఫరియా..

Whatsapp Image 2023 07 12 At 10.05.16 Am

Whatsapp Image 2023 07 12 At 10.05.16 Am

ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఈ మధ్య తన హాట్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ అమ్మడి బోల్డ్ పోజులు అందరిని బాగా ఆకట్టుకున్నాయి..బ్లాక్ ట్రెండీ వేర్లో ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోజుల్లో రెచ్చగొట్టింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. అలాగే హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఫరియా ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ కి చెందిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ కావాలనే ఆశతో మోడల్ గా మారింది.. యంగ్ డైరెక్టర్ అనుదీప్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా తెలుగు తెరకు పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ గా మెప్పించింది..జాతిరత్నాలు సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ వసూళ్ల వర్షం కురిపించింది. చిట్టి పాత్రలో ఫరియా అదరగొట్టింది.ఇన్నోసెంట్ లాయర్ గా ఈ భామ నవ్వులు పూయించింది.

జాతిరత్నాలు సినిమాతో ఫరియా బాగా పాపులర్ అయింది.. అయితే ఆ మూవీ విజయం సాధించిన కానీ ఈ భామకు ఆఫర్స్ అంతగా రావడం లేదు.జాతి రత్నాలు తరువాత ఈ భామ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో  చిన్న క్యామియో రోల్ చేశారు.. ఆ తరువాత బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ ను కూడా చేసింది ఈ భామ.సంతోష్ శోభన్ తో నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అలాగే రీసెంట్ గా రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో కూడా నటించింది ఈ భామ.. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కూడా నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ భామ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు మరియు ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది..