యాక్టర్ కన్నా పర్హాన్ అక్తర్ దర్శకుడిగా పర్ఫెక్ట్ అని తన ఫస్ట్ ఫిల్మ్ దిల్ చాహతా హైతోనే ఫ్రూవ్ చేశాడు. ఇక అతడి దర్శకత్వంలో వచ్చిన డాన్ సిరీస్కు స్పెషల్ క్రేజ్. కానీ ఎందుకో కెమెరా పక్కన పెట్టి యాక్టింగ్పై ఫోకస్ చేశాడు. తాజాగా 120 బహుదూర్తో పలకరించాడు పర్హాన్. వార్ డ్రామాతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేసింది. ఇక హీరోగా చేసిన ప్రయత్నాలు చాల్లే అనుకున్నట్లున్నాడు. మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు.
Also Read : MSG : మనశంకర వరప్రసాద్.. సెకండ్ సాంగ్ రిలీజ్ కు డేట్ లాక్
రణవీర్ సింగ్తో 2023లో ఎనౌన్స్ చేసిన డాన్ 3కి రోల్ కెమెరా యాక్షన్ చెప్పబోతున్నాడట పర్హాన్ అక్తర్. విక్రాంత్ మాస్సే నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో కృతి సనన్, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారన్నది లేటెస్ట్ బజ్. డాన్, డాన్2లో షారూఖ్ ఖాన్ ప్లేసును రీ ప్లేస్ చేయబోతున్నాడు రణవీర్. 15 ఏళ్ల తర్వాత కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ కాబోతున్నాడు పర్హాన్. డాన్3 కన్నా ముందే ఎనౌన్స్ చేసిన మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘జీ లే జరా’ను కూడా ట్రాక్ ఎక్కిస్తాడట పర్హాన్. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ హీరోయిన్లుగా రోడ్ ట్రిప్ డ్రామాను 2021లో ప్రకటించాడు దర్శకుడు. ఈ ముగ్గురు భామలకు పెళ్లిళ్లై, పిల్లలు కూడా పుట్టారు కానీ ప్రాజెక్ట్ పత్తాలేదు. దీంతో ఆల్మోస్ట్ ఈ సినిమా షెడ్డుకు వెళ్లిపోయిందని ఫిక్సయ్యారు బీటౌన్ ఆడియన్స్. అప్పట్లో ముగ్గురు భామల డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో కొన్ని కారణాలు ఈ సినిమాకు ముందుకు వెళ్లకుండా బ్రేకులేస్తే ఇప్పుడు సమస్య తీరిపోయిందట. హీరోయిన్స్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయబోతున్నారని ఈ ప్రాజెక్ట్ తర్వలో స్టార్ట్ కాబోతుందని రివీల్ చేశాడు పర్హాన్ అక్తర్. ఇక ఈ సినిమా కనుక వస్తే ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో మరో మైల్ స్టోన్ మూవీగా మారడం ఖాయమంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.