Site icon NTV Telugu

FAPTO Demands: ఏపీ సీఎస్‌కు ఫ్యాప్టో లేఖ.. 18 డిమాండ్స్ ఇవే!

Fapto Demands

Fapto Demands

FAPTO18 Key Demands: ఏపీ సీఎస్‌కు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) లేఖ రాసింది. ఉపాధ్యాయ వర్గంగా విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలతో సతమవుతమవుతున్న వేళ పలు దఫాలు ప్రాతినిథ్యం చేసినా ఫలితాలు లేని పరిస్థితిల్లో ఫ్యాప్టో లేఖ రిలీజ్ చేసింది. ఏపీ సీఎస్‌కు 18 డిమాండ్లతో కూడిన లేఖను రాసింది. P-4 దత్తత అంశం సహా ఉపాధ్యాయుల సమస్యలపై డిమాండ్లను లేఖలో పేర్కొంది. ఫ్యాప్టో 18 డిమాండ్స్ ఏంటో చూద్దాం.

ఫ్యాప్టో డిమాండ్లు:
1. పి-4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు.

2. నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.

3. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలి.

4. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి.

5. హైస్కూల్ ప్లస్ లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యధాతధంగా కొనసాగించాలి.

6. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి.

7. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ( I.R) ని ప్రకటించాలి.

8. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎనా క్యాష్మెంట్ ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి.

9. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 03 పెండింగ్ డి. ఏలను ప్రకటించాలి. డిఏ బకాయిలను, 11వ పీఆర్సీ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.

10. సి.పి.ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబరు 01 తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో నం:57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోనికి తీసుకుని రావాలి.

Also Read: Gottipati Ravi Kumar: టెన్షన్ అస్సలు వద్దు.. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించం!

11. అసంబద్ధంగా వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లా డీఈఓ ను తక్షణమే విధుల నుండి తొలగించాలి.

12. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.

13. ఇంకా పదవీకాలం పూర్తి కాని స్కూల్ గేమ్స్ సెక్రటరీ లను (ఎస్ జి.ఎఫ్) సెక్రెటరీలను తొలగించడం సరైనది కాదు. తిరిగి వారిని కొనసాగించాలి.

14. అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి.

15. సూపర్ న్యూమరి పోస్టులను సృష్టించి గ్రేడ్-2 పండిట్లు, పి.ఈ. టి.లకు పదోన్నతులు కల్పించాలి.

16. మున్సిపల్ ఉపాధ్యాయుల GPF తదితర సమస్యలను పరిష్కరించాలి.

17. EHS / మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి.

18. మండల విద్యా శాఖాధికారుల బదిలీలలో చేపట్టాలి.

Exit mobile version