Harry Brook: టెస్టులాడే వ్యక్తికి కోట్లు కుమ్మరించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఎస్ఆర్హెచ్ గేమ్ స్ట్రాటజీ ఎవరికీ అంతుచిక్కదు. టీ20లంటే వేగంగా పరుగులు సాధించడం.. కానీ ఆ సంగతి పక్కన బెట్టి టెస్టులు ఆడే ఆటగాడికి కోట్ల రూపాయలు గుమ్మరించి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాకా వరుసగా రెండుమ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమైతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధను హ్యారీ బ్రూక్ రూపంలో ఎస్ ఆర్ హెచ్ అనుభవిస్తుందని చెప్పొచ్చు.. సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసింది. అయితే అంతకు ముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న కారణంతో హ్యారీ బ్రూక్ కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లో హిట్టింగ్ చేశాడంటే టీ20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నవ్వుల పాలయ్యేలా చేసింది.
Also Read : Blast : ఎల్బీనగర్లో భారీ పేలుడు.. కంపించిన ఇళ్లు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడ. రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్ బోల్డ్ అయ్యాడు. 21 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరే ఫస్ట్ మ్యాచ్ లో ఏదో టెన్షన్ లో ఔట్ అయ్యాడు అనుకుంటే.. రెండో మ్యాచ్ లో దారుణంగా ఔటయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్ స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే ఆడేది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 13.25 కోట్లు ఖర్చు చేసి న హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశపడుతున్నారు.
Also Read : Anantha Sriram: అలరించే పదవిన్యాసాల అనంత్ శ్రీరామ్!
అయితే నిజానికి బ్రూక్ కు టెస్టు క్రికెట్ లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్సింగ్స్ ల్లో ఏకంగా నాలుగు శతకాలు, మూడు అర్థశతకాలు కొట్టాడు. ఇంగ్లండ్ తరపున 20 టీ20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్ రేట్ మాత్రం 140కి దగ్గరికి ఉంది. భవిష్యత్తులోనైనా హ్యారీ బ్రూక్ తన ఇచ్చిన డబ్బులను న్యాయం చేసి. మంచి ఇన్సింగ్స్ లు ఆడతాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!