NTV Telugu Site icon

Fans Rivalry: అత్తిలిలో దారుణం.. ఫ్యాన్స్ మధ్య గొడవ..

Murder

Murder

ఏదో చిన్న చిన్న కారణాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఫ్యాన్స్ మధ్య హత్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. తన అభిమాన హీరో పై ప్రేమతో మరో హీరో అభిమానిని హత్య చేశాడు. అత్తిలిలో వెలుగు చూసిన దారుణం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అత్తిలిలో ఓ ఇంటికి పెయింటింగ్ వేసేందుకు మూడు రోజుల క్రితం ఏలూరు నుంచి వచ్చారు కిషోర్, హరికుమర్ అనే ఇద్దరు కూలీలు.

Read Also: GT vs LSG : ఉత్కంఠ పోరులో లక్నోపై గుజరాత్‌ గెలుపు

పని ముగించుకుని అదే బిల్డింగ్ లో నిద్రిస్తున్న కూలీల మధ్య హీరోల విషయంలో గొడవ చెలరేగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. పవన్ కళ్యాణ్ వీడియో వాట్స్ ఆప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు కిషోర్.. అయితే, ప్రభాస్ వీడియో స్టేటస్ పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు హరికుమార్..కిషోర్ తన మాట వినకపోవడంతో సెంట్రింగ్ కరతో తలపై కొట్టి హత్య చేశాడు హరికుమార్..ప్రభాస్ ఫ్యాన్ హరికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ విషయంలో గొడవ జరగడం, అది హత్యకు దారితీయడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇదేం గొడవ, అభిమానం ప్రాణాలు తీసేవరకూ రావడం దారుణం అంటున్నారు.

Read Also: Bhatti Vikramarka: సీఎల్పీ నేత పాదయాత్రలో అకాల వర్షం.. పరుగులు తీసిన నేతలు